Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:22 PM

సమస్యలు చెప్పండి.. పరిష్కారం మా బాధ్యత: ఎస్పీ పరితోష్ పంకజ్

08-06-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మకుండా తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును జిల్లా పోలీసు కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

Sthanikam

సమస్యలు చెప్పండి.. పరిష్కారం మా బాధ్యత: ఎస్పీ పరితోష్ పంకజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News