Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటమే భగత్ సింగ్ ఘనమైన నివాళి: రవీందర్

24-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

  బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ దేవ్ ల ఆశయ సాధన లో యువత ముందు ఉండడమే ఘనమైన నివాళి అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, సహాయ కార్యదర్శి అవుట రవీందర్ అన్నారు.

      సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో నెహ్రూగంజ్ అమాలి యూనియన్కార్యాలయం దగ్గర షహీద్ భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖదేవ్ 95 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాణాలను దేశం కోసం తృణ ప్రాయంగా అర్పించిన రోజు అని అన్నారు. అంతరాలు, వివక్షతలు లేని,శ్రమ దోపిడీ లేని సమ సమాజం కావాలని పోరాడి ఒరికొయ్యలకు ఊయల లూగిన విప్లవ వీర కిశోరాలు , నిజమైన దేశభక్తులు భగత్ సింగ్, రాజ్ గురు , సుఖదేవ్ లు అని కొనియాడారు.ఏదైనా నమ్మే ముందు దానిని ప్రశ్నించాలని, విచక్షణతో ఆలోచించడం ముఖ్యమని, మతం అనేది మనిషి బలహీనతకు సంకేతం అని, మనుషులను విడదీసే వ్యవస్థను భగత్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. నిజమైన స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలకులు వెళ్ళిపోవడం కాదు, సామాన్యుడు, కార్మికుడు, రైతు... ప్రతి ఒక్కరూ దోపిడీకి గురికాకుండా జీవించగలగడం అని నమ్మిన వీరుడు భగత్ సింగ్ అని అన్నారు.వారి ఆశయాల కొనసాగింపులో పనిచేద్దాం. ప్రజలను దోపిడీ చేస్తున్న పాలకుల విధానాలపై పోరాడుదామని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. వారి స్ఫూర్తితో నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం కు వ్యతిరేకంగా యుద్ధాలు వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో యువతను కదిలించి ఉద్యమాలకు తీసుకురావాలని కోరారు.

    ఈ కార్యక్రమంలో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి హమాలీ యూనియన్ అధ్యక్షుడు ఆవురేష్ మారయ్య కార్యదర్శి లక్ష్మీపతి సభ్యులు వీరబాబు, దూదిమెట్ల వెంకన్న జగదీష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటమే భగత్ సింగ్ ఘనమైన నివాళి: రవీందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News