Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:01 AM

సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతి రావు పూలే

11-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పూలే ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

సూర్యాపేట: సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే అని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎం జి రోడ్డు వృత్తం వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే సీతారామా రావుతో కలిసి పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పూలే జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గొప్ప గౌరవమని అన్నారు. సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కుల, మత భేదాలు ఎక్కువగా ఉన్న కాలంలో సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు పూలే అని కొనియాడారు. తన భార్య సావిత్రిబాయికి విద్యాబోధన చేసి, ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్తగా గుర్తు చేశారు. కుల వివక్షకు గురైన వర్గాలను దేవాలయాలు, పాఠశాలల్లోకి అనుమతించని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని సమాజంలో మార్పు తీసుకువచ్చారని తెలిపారు.

అదనపు కలెక్టర్ కే సీతారామా రావు మాట్లాడుతూ కుల వివక్ష లేకుండా సమాజం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ విద్యను పొందాలని పూలే బోధించిన సిద్ధాంతాలను గుర్తు చేశారు. మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి అపారమని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. పూలే ఆశయాలను స్మరించుకొని మంచి సమాజ నిర్మాణం కోసం వారు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగాధికారి వేణు మాధవరావు, సహాయ పోలీసు కమిషనర్ ప్రసన్న కుమార్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతి రావు పూలే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News