Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:56 AM

సమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి

సమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి

సమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి
25-02-2026 192 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక వైద్య పరికరాల అందజేత – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

మాజసేవలో ప్రతి ఒక్కరు ముందుండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. డాక్టర్స్ ఫర్ యు స్వచ్ఛంద సంస్థ సహకారంతో హెచ్సిఎల్ ఫౌండేషన్ విరాళంగా అందించిన అత్యాధునిక వైద్య పరికరాలను సూర్యాపేట ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు అందించిన హెచ్సిఎల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరికరాలు రోగుల సంరక్షణను, వైద్య సేవల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడం ఎంతో ఉపయుక్తమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రైవేటు స్థాయికి తగ్గకుండా వైద్యం అందుతుందనే నమ్మకం పేద ప్రజల్లో పెరుగుతుందని అన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లలేని రోగులకు ఈ పరికరాలు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈ విరాళం అందించబడిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల అదనపు వైద్య విద్యాధికారి మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. జయలత, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి అదనపు వైద్య విద్యాధికారి మరియు వైద్య అధికారి డాక్టర్ పి. శ్రావణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, హెచ్సిఎల్ ఫౌండేషన్ సహాయ సంచాలకురాలు సీమి సూరి, డాక్టర్ చేతన తీర్థహళ్లి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News