Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం

సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం

సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం
21-03-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ఏదులాపురం ప్రాంతంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా, మత సామరస్యానికి నిదర్శనంగా ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ మద్దులపల్లిలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లిం సోదరులకు అండగా నిలుస్తుందని తెలిపారు.

పండుగ సందర్భంగా మద్దులపల్లిలోని ఎస్.కె. జానీ నివాసం, ఖమ్మం నగరంలోని సీనియర్ నాయకుడు ఎస్.కె. ఇమామ్ భాయ్ గృహాలను సందర్శించిన దయాకర్ రెడ్డి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఈద్ ముబారక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్ గొడ్డుగొర్ల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సమైక్యతా సౌరభంతో రంజాన్ సంబరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News