Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:39 AM

సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి

26-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సఖి సెంటర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం సందర్శించారు. హౌసింగ్ బోర్డ్‌లో ఉన్న సెంటర్‌లో సిబ్బంది వివరాలు, అందిస్తున్న సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

సఖి సెంటర్‌కు వచ్చే కేసుల స్వరూపం, బాధిత మహిళలకు అందిస్తున్న కౌన్సిలింగ్, సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సెంటర్ కీలక పాత్ర పోషించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు.

అనంతరం మాస్కుంటలో నిర్మాణంలో ఉన్న సఖి భవనాన్ని పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అలాగే సింగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న బాలసదనం భవనాన్ని సందర్శించి పనులు వేగవంతం చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

సఖి సెంటర్ సందర్శన.. మహిళల భద్రతపై కలెక్టర్ దృష్టి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News