Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:56 AM

సైనిక్ పాఠశాల ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం

28-02-2026 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

50 మంది పరీక్ష రాస్తే 45 మంది అర్హత

రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్రస్థానాలు

సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కూసుమంచి కేంద్రంలో నిర్వహిస్తున్న ఆజాద్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 50 మంది విద్యార్థుల్లో 45 మంది అర్హత సాధించడం విశేషం. గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించి గుర్తింపు పొందిన ఈ కేంద్రం, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించడంతో యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ స్థానాలు దక్కించుకోవడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.

మిన్నంటిన సంబరాలు

ఫలితాలు వెలువడిన వెంటనే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. అర్హత సాధించిన విద్యార్థులను సన్మానించారు.

ఈ సందర్భంగా నిర్వహణాధికారి మరియు విద్యా విభాగాధిపతి అజహరుద్దీన్ మహ్మద్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా నవోదయలో 30 స్థానాలు, ఏకలవ్యలో 14 స్థానాలు, రాష్ట్ర సైనిక్ పాఠశాలలో మూడో స్థానం, వందలోపు 14 ర్యాంకులు సాధించామని గుర్తు చేశారు. వెనుకబడిన ఖాళీల్లో 36 స్థానాలు సాధించిన ఏకైక సంస్థగా జిల్లా స్థాయిలో తమ కేంద్రం నిలిచిందన్నారు.

కరస్పాండెంట్ జానిమియా మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫలితాలు మరింత మెరుగైన విజయాలకు నాంది పలుకుతున్నాయని అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆజాద్, సబిహా, సయ్యద్ మియా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సైనిక్ పాఠశాల ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News