Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:58 PM

సైబర్ మోసాలకు అప్రమత్తంగా ఉండాలి.. విద్యార్థులకు సూచనలు

28-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, మామిడిపల్లి అగ్రికల్చర్ కాలేజీలలో అంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళా మరియు బాలల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏహెచ్‌టీయూ ఇన్‌చార్జ్ సీహెచ్ ప్రసాద్ రావు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, కార్మికుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, అవయవాల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక దాడులు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలపై విద్యార్థులకు వివరించారు. అలాగే సైబర్ స్టాకింగ్, సైబర్ బులీయింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, మోసపూరిత లింకులు వంటి సైబర్ నేరాల నుండి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర సేవల కోసం పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు 100, 112, మహిళల హెల్ప్‌లైన్ 1091 / 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల యాజమాన్యం, ఏహెచ్‌టీయూ ఎస్ఐ ఎం.డి లాల్ అహ్మద్, మాణిక్ రెడ్డి, పోలీసు సిబ్బంది మరియు సుమారు 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

సైబర్ మోసాలకు అప్రమత్తంగా ఉండాలి.. విద్యార్థులకు సూచనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News