Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దేప సురేఖ భాస్కర్ రెడ్డి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 06:24 AM

సాధారణ ప్లాట్‌ఫాంపై నిలిచిన అసాధారణ ఋషి: పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద్

07-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

సాధారణ ప్లాట్‌ఫాంపై నిలిచిన అసాధారణ ఋషి: పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద్

ప్రయాగ్‌రాజ్రైల్వే స్టేషన్‌లో ఒక సాధారణ ప్రయాణికుడిలా ప్లాట్‌ఫాంపై నిలబడి రైలు కోసం ఎదురుచూస్తున్న ఆయన, వాస్తవానికి పూరీ గోవర్ధన పీఠాధిపతి, శంకరాచార్య స్వామి నిశ్చలానంద్ సరస్వతి. సాదాసీదా వస్త్రాలు, నిస్సంగ జీవన శైలి ఆయనను ఒక సాధారణ వ్యక్తిలా కనిపించేలా చేస్తున్నా, ఆయన మేధస్సు, ఆధ్యాత్మిక లోతు, శాస్త్రీయ ఆలోచన ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాయి. వేదాంత జ్ఞానాన్నిఆధునిక శాస్త్రంతో అనుసంధానిస్తూ, భారత ఋషి సంప్రదాయం మహత్తును ఆయన తన జీవితంతో నిరూపిస్తున్నారు. స్వామినిశ్చలానంద్ గణితశాస్త్రం, ముఖ్యంగా వేదగణితంపై లోతైన పట్టు కలిగిన పండితులలో ప్రముఖులు. వేదగణిత సూత్రాలను వినియోగించి సంక్లిష్ట గణనలనుసులభతరం చేసే ఆయన అభ్యాసం కారణంగా, దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు ఆయన సలహాలు కోరుకొంటున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగం, ఆర్థిక విశ్లేషణలు, సంక్లిష్ట మోడలింగ్ వంటి అంశాల్లో ఆయన సూచనలు కొందరు శాస్త్ర, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అయితే, ఈ గౌరవాలు, ప్రశంసల మధ్య కూడా ఆయన జీవితం పూర్తిగా తపస్సు, నిశ్శబ్ద సేవ, ఆత్మపరిశీలనలతో నిండి ఉంది.

ఆయనరచించిన అనేక గ్రంథాలు వేదాంత తత్త్వం, గణిత తర్కం, ధర్మం-సామాజిక జీవన సంబంధాన్ని సులభ భాషలో వివరిస్తాయి. గోవర్ధన మఠం ద్వారా, యువతలో ఆధ్యాత్మిక చైతన్యంతో కూడిన శాస్త్రీయ దృక్కోణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కీర్తి, ప్రచారం, వ్యక్తిగత లాభం వీటిలో ఏదీ ఆయన లక్ష్యం కాదు; మానవ జీవితాన్ని అంతర్లీన ఆనందం, ధర్మసంస్కృతితో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ఆయన సాధన. ఇలాంటి ఋషులను ఇచ్చిన సంప్రదాయం మన హిందూ భారతదేశఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది.

Sthanikam

సాధారణ ప్లాట్‌ఫాంపై నిలిచిన అసాధారణ ఋషి: పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News