Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

సదాశివపేటలో ఘనంగా శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవాలు

27-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని శ్రీ మాణిక్ ప్రభు మందిరంలో మే 31వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మందిర భక్త బృందం తెలిపింది. సర్వతోముఖి మహాయోగి సద్గురు బాలమార్తాండ మహారాజ్ దివ్య మార్గదర్శకత్వంలో జరిగే ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలకు సంబంధించిన కరపత్రికను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజుకు అందజేసి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఉత్సవాలలో భాగంగా మే 31 ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీమద్భాగవత పురాణ గ్రంథం, భక్త సురేష్ ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్ర నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం పూజా కార్యక్రమాలు, శ్రీమద్భగవద్గీత పారాయణం, శ్రీమద్భాగవత ప్రవచనాలు, భజనలు, నామస్మరణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి. మధ్యాహ్నం తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేయనున్నారు. మానవ జన్మ సార్థకతకు, మోక్ష సాధనకు శ్రీమద్భాగవత పురాణ శ్రవణం ఎంతో విశిష్టమైందని నిర్వాహకులు పేర్కొన్నారు. సదాశివపేటతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రవచనాలు విని భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలని పులిమామిడి రాజు కోరారు. ఈ కార్యక్రమంలో యం. మనోహర్, సుధాకర్ రెడ్డి, పండాల జగదీశ్వర్ పంతులు, కుల్బగూర్ విజయకుమార్ చిదానందం, వాదోని చంద్రశేఖర్, విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సదాశివపేటలో ఘనంగా శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News