Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:41 AM

సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.

28-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:

జిల్లాలో సదరం (SADAREM) సేవలను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని సెర్ఫ్ సీఈఓ దివ్య అధికారులకు ఆదేశించారు. యూడీఐడీ (UDID) దరఖాస్తులపై కూడా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరం క్యాంపుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన క్లియర్ చేయాలని, కొత్త దరఖాస్తులను ఆలస్యం చేయకుండా నమోదు చేసి వికలాంగత సర్టిఫికేట్లు జారీ చేయాలని సూచించారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు మాట్లాడుతూ… సదరం సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. యూడీఐడీ దరఖాస్తులు వచ్చిన వెంటనే నమోదు చేసి, రెన్యువల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు.

యూడీఐడీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి, సంబంధిత డేటాను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. డిజిటైజేషన్, సరెండర్, పోగొట్టుకున్న కార్డుల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఎన్‌హెచ్‌సీ, పీడబ్ల్యూడీ, స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో కార్డులు లేనివారికి వెంటనే జారీ చేయాలని తెలిపారు.

డీఆర్‌డీఓ నాగిరెడ్డి మాట్లాడుతూ… ఈ నెల సదరం స్లాట్లు ఇప్పటికే విడుదలయ్యాయని, లబ్ధిదారులకు ముందస్తుగా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డా. కిరణ్, ఏపీఓ (పెన్షన్) సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News