Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:32 AM

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

24-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు పలు హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

15సిలిండర్ల పట్టివేత.

ఈ దాడుల్లో వాణిజ్య (కమర్షియల్) అవసరాల కోసం అక్రమంగా వాడుతున్న మొత్తం 15 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ప్రభుత్వం సామాన్యులకు అందించే గృహోపయోగ సిలిండర్లను ఇలా యథేచ్ఛగా వ్యాపారాలకు వాడుతుండటం, దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ.. కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన సిలిండర్లకు సంబంధించి, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం, సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని, ముందు ముందు కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వారు తేల్చిచెప్పారు. ఈ తనిఖీలలో డి సి ఎస్ ఓ రోజా రాణి, డిటి బాలమణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Sthanikam

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News