Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:34 PM

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

04-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి:సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పటాలు ఎగరేసే సమయంలో చైనా మాంజా వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అల్లాదుర్గం మండల ఎస్సై శంకర్ తెలిపారు. అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో గాలి పటాల వినోదం పేరుతో చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, మనుషులు, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందన్నారు.గాలి పటాలు ఎగరడానికి ఉపయోగించే నైలాన్, సింథటిక్ దారాలకు పూత పూసిన చైనా మాంజా అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ మాంజా కారణంగా పక్షులు గాయపడటం, మరణించడం, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు.చైనా మాంజాను నిల్వ చేసినా, రవాణా చేసినా, తయారు చేసినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్ 223, 125తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 5, 15 కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఎవరైనా చైనా మాంజా తయారీ, అమ్మకం లేదా రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్సై శంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించి పండుగను సురక్షితంగా జరుపుకోవచ్చన్నారు.

Sthanikam

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News