Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:18 AM

సావిత్రిబాయి ఫూలే జన్మదినం: మహిళా విద్యోద్ధరణకు మార్గదర్శకురాలు- సంధ్య ప్రిన్సిపాల్ (బి‌సి గురుకుల నల్గొండ బాలికల పాఠశాల)

సావిత్రిబాయి ఫూలే జన్మదినం: మహిళా విద్యోద్ధరణకు మార్గదర్శకురాలు- సంధ్య ప్రిన్సిపాల్ (బి‌సి గురుకుల నల్గొండ బాలికల పాఠశాల)

సావిత్రిబాయి ఫూలే జన్మదినం: మహిళా విద్యోద్ధరణకు మార్గదర్శకురాలు- సంధ్య ప్రిన్సిపాల్ (బి‌సి గురుకుల నల్గొండ బాలికల పాఠశాల)
January 03, 2026 08:52 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

సావిత్రిబాయి ఫూలే జన్మదినం: మహిళా విద్యోద్ధరణకు మార్గదర్శకురాలు- సంధ్య ప్రిన్సిపాల్ (బి‌సి గురుకుల నల్గొండ బాలికల పాఠశాల)

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి డి.డి. దాసు : జనవరి 3 శనివారం


మహాత్మా జ్యోతిభా ఫూలే బి. సి. బాలికల గురుకులం నల్లగొండలో ఈరోజు సావిత్రిబాపూలే 195వ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సంధ్య మరియు ఉపాధ్యాయ బృందం సావిత్రిబాయి పూలే గారు బాలికల కోసం వారి విద్య కోసం చేసిన కృషిని స్మరించుకోవడం జరిగింది. ఈ వెడుకలలో ప్రిన్సిపాల్ సంద్య మాట్లాడుతూ విద్యార్ధులకు సావిత్రి బాయి గూర్చి తన మాటలలో

సావిత్రిబాయి ఫూలే - ఆదర్శమైన జీవితం:

సావిత్రిబాయి ఫూలే (1831-1897) మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో మాలీ కుల రైతు కుటుంబంలో జన్మించారు. 9 ఏళ్ల వయసులో జ్యోతిరావు ఫూలేను వివాహం చేసుకుని, భర్త ప్రోత్సాహంతో విద్యాభ్యాసం చేసి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మారారు.1848 మే 12న పూణేలో బాలికలకు మొదటి పాఠశాలను భర్తతో ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాలు, దలిత బాలికల విద్యకు అడ్డుకోవడానికి వ్యతిరేకించిన సమాజానికి వ్యతిరేకంగా సాహసంగా నిలబడారు. కుల వివక్షత, బాల్య వివాహాలు, సతీసహగమనానికి వ్యతిరేకి. వితంతువుల పునర్వివాహాలు ప్రోత్సహించారు. అక్రమ సంతాన శిశువుల కొరకు ఒక ఆశ్రమం నడిపి, మహిళల సేవా మండలి కూడా ఏర్పాటు చేశారు. సత్యశోధక సమాజ్‌లో కీలక పాత్ర పోషించి, కులాంతర వివాహాలు జరిపించారు. కవయిత్రిగా 'కవ్యఫూల', మహాభారతం అనువదించారు.1897 ప్లేగు వ్యాధి సమయంలో పేద పిల్లలకు సేవ చేస్తూ మరణించారు. ఆమె జీవితం మహిళా విద్య, సామాజిక న్యాయం, సంస్కరణలకు ఆదర్శం. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, స్త్రీవాదికురాలిగా చరిత్రలో ధ్రువతార నిలిచి మన మహిళలందరికి అధర్శ రాలు గా ఉన్నారని కొనియాడారు. ప్రతి మహిళా కూడా సావిత్రి బాయి ఫూలే ని ఆధార్శంగా తీసుకొని తమ జీవితములో ఉన్నత స్థానమును చేరుకోవాలని తెలియచేసారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News