Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

రొప్పాల దాహార్తికి ముగింపు – మంత్రి సవిత చొరవతో శాశ్వత తాగునీటి సౌకర్యం

25-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా లోని పెనుకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న రొద్దం మండలం, పెదమంతూరు పంచాయతీకి చెందిన రొప్పాల గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. దీంతో గ్రామస్తులు మంత్రి సవితకు కలిసి తమ సమస్యను వివరించారు.

గ్రామస్తుల వినతిని సానుకూలంగా స్వీకరించిన మంత్రి సవితమ్మ వెంటనే స్పందించి రూ. 9 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో పెన్నానది నుంచి రొప్పాల గ్రామం వరకు వాటర్ లింక్ ద్వారా పైప్‌లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా పనులు విజయవంతంగా పూర్తి చేశారు.

పనులు పూర్తయ్యాక మోటార్‌ను అమర్చుకుని పరీక్షించగా పుష్కలంగా నీరు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా గ్రామాన్ని వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించిన మంత్రి సవితమ్మకు గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉన్న మంత్రి సవిత సేవలను ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

రొప్పాల దాహార్తికి ముగింపు – మంత్రి సవిత చొరవతో శాశ్వత తాగునీటి సౌకర్యం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా లోని పెనుకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న రొద్దం మండలం, పెదమంతూరు పంచాయతీకి చెందిన రొప్పాల గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. దీంతో గ్రామస్తులు మంత్రి సవితకు కలిసి తమ సమస్యను వివరించారు.

గ్రామస్తుల వినతిని సానుకూలంగా స్వీకరించిన మంత్రి సవితమ్మ వెంటనే స్పందించి రూ. 9 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో పెన్నానది నుంచి రొప్పాల గ్రామం వరకు వాటర్ లింక్ ద్వారా పైప్‌లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా పనులు విజయవంతంగా పూర్తి చేశారు.

పనులు పూర్తయ్యాక మోటార్‌ను అమర్చుకుని పరీక్షించగా పుష్కలంగా నీరు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా గ్రామాన్ని వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించిన మంత్రి సవితమ్మకు గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉన్న మంత్రి సవిత సేవలను ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News