Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:08 AM

రోగులకు మెరుగైన సేవలే లక్ష్యం – తుర్కపల్లి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

28-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మంగళవారం నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేయడంతో పాటు ప్రయోగశాల, ఔషధ నిల్వ విభాగం, ఇతర సేవా విభాగాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి క్రమం తప్పకుండా పరీక్షలు జరుగుతున్నాయా, అవసరమైన మందులు అందుతున్నాయా అనే విషయాలను ఆరా తీశారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలనీ, ఆసుపత్రిలో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సహా అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారి వివరించారు. ప్రతిరోజు లోపలి రోగులు, బాహ్య రోగుల సంఖ్య, గర్భిణీల పరీక్షలు, అందుబాటులో ఉన్న వైద్య పరీక్షలు, ప్రతి నెల జరిగే ప్రసవాల సంఖ్య వంటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందుతుందని, ముఖ్యంగా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ తనిఖీలో ఉప కలెక్టర్ ఉమా హారతి, మండల అభివృద్ధి అధికారి, వైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోగులకు మెరుగైన సేవలే లక్ష్యం – తుర్కపల్లి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News