Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

రోడ్డు ప్రమాదాల నివారణకోసం డ్రైవర్లకు కంటి పరీక్షలు.

రోడ్డు ప్రమాదాల నివారణకోసం డ్రైవర్లకు కంటి పరీక్షలు.

రోడ్డు ప్రమాదాల నివారణకోసం డ్రైవర్లకు కంటి పరీక్షలు.
March 30, 2026 03:13 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రోడ్డు ప్రమాదాల నివారణకోసం డ్రైవర్లకు కంటి పరీక్షలు.

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పోలీసు డిజిపి ప్రారంభించిన ‘ఆరవ్ అలైవ్’ మహా ఉద్యమం కార్యక్రమం 3వ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కోదాడ పబ్లిక్ క్లబ్ పంక్షన్ హాల్ నందు పోలీసుల అధ్వర్యంలో వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది, కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ప్రారంభించారు. మంచివారికి పోలీసు మిత్రుడు, ఫ్రెండ్లీ పోలీస్, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉంటాం, ప్రజల రక్షణలో అనుక్షణం పని చేస్తున్నాం అన్నారు. ప్రస్తుత సమాజంలో రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలు, సైబర్ మోసాలు ప్రధాన సమస్యగా మారాయని, వీటి నివారణకు జాగ్రత్తలు పాటించడం, అవగాహన ముఖ్యం అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఈరోజు పోలీసు అధ్వర్యంలో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించాం అన్నారు. రోజంతా శ్రమించి చెమటోడ్చి సంపాదించిన డబ్బు అవగాహన లోపంతో సైబర్ మోసాల బారిన పడుతున్నాయి ప్రజల అత్యాశ అవగాహన లోపాన్ని సైబర్ మోసగాళ్లు అవకాశంగా చేసుకుని డబ్బు దొచేస్తున్నరు, అప్రమత్తంగా ఉండాలి మెసేజ్ రూపంలో వచ్చే బ్లూ లింక్స్ అనుసరించి, అపరిచితులు ఫోన్ కాల్స్ స్పందించి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలు, ఓటిపి వివరాలు తెలపవద్దు, ప్రమాదంలో ఉన్నారు, మీకు భౌమతులు వచ్చాయి అంటే స్పందించి తెలియని వక్తులకు డబ్బులు పమపవద్దు అని కోరారు. మాదకద్రవ్యాల మత్తుకు బానిసలు కావద్దు, మత్తులో నేరాలు చేస్తారు అన్నారు, డ్రగ్స్ లాంటి వాటి కార్యకలాపాల వివరాలు వార్డు, గ్రామ పోలీసు అధికారులకు, డయల్ 100 కు సమాచారం అందించి డ్రగ్స్ నివారణలో భాగస్వామ్యం కావాలని కోరారు.ముందు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చును అన్నారు. డ్రైవర్ వృత్తి చాలా కష్టతరమైన పనిని ఈ వృత్తిని ఎంచుకొని నిర్విరామంగా కష్టపడుతూ డ్రైవర్లు ఆరోగ్యాలను లెక్క చేయడంలేదని ఎస్పి అన్నారు, డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని డ్రైవర్ యొక్క కంటి చూపు బాగా ఉంటే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని తెలిపారు. డ్రైవర్లకు వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం జరుగుతుంది అలాంటి వారు కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకొని తగిన జాగ్రత్తలు పాటించాలి, కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని అన్నారు. చాలామంది డ్రైవర్లు కంటి చూపులు అశ్రద్ధ చేస్తున్నారని ఉద్దేశంతో రాష్ట్ర డిజిపి ఇచ్చిన పిలుపు మేరకు ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలో పోలీసుల అధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిభిరం ఏర్పాటు చేశాము. ఈ శిభిరం లో కోదాడ పట్టణానికి చెందిన అశోక్ కంటి హాస్పటల్, పుల్లురి కంటి హాస్పటల్, సురభి కంటి హాస్పటల్, లక్ష్మి కంటి హాస్పటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు, మందులు అందించారు.రోడ్డు భద్రత అంటే రోడ్డు పై ప్రయాణించే వాహనదారులు వాహనాలను జాగ్రత్తగా డిఫెన్సివ్ తో నడిపి ప్రమాదాలను నివారించడం. రోడ్డు భద్రత రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకము, ప్రతి వహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి, ఎక్కడపడితే అక్కడ అవహనాలు నిలపవద్దు, తప్పుడు మార్గంలో వాహనాలు నడిపితే ప్రమాదాలు సంభవిస్తాయి అన్నారు. డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలి అంటూ. వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రహదారి సూచనలను పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, కారులో సీట్ బెల్ట్ మరియు ద్విచక్ర వాహనంపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించరాదని, అలసట లేదా నిద్రలేమి ఉన్నప్పుడు వాహనం నడపవద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి పత్రాలు కలిగి ఉండాలి, బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సూచించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న జాగ్రత్త ప్రాణాలను కాపాడగలదని ఎస్పీ పేర్కొన్నారు.ఈ శిబిరం ద్వారా 500 వందలకు పైగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ సీఐ శివ శంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఎస్ఐ సుదీర్, కంటి డాక్టర్లు అశోక్ కుమార్, మల్లీశ్వరి, రామతులసి, రామ్ చరణ్, సిబ్బంది మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News