Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:41 AM

రోడ్డు భద్రతకు గ్రామం ముందడుగు – హెల్మెట్ లేకుంటే ప్రవేశం లేదు.నిర్నెముల

12-04-2026 130 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్నెముల ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ యువకులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామంలో హెల్మెట్ ధరించని వారికి ప్రవేశం నిరాకరించాలనే సందేశంతో పోస్టర్లు, స్టేటస్‌లను షేర్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.

సర్పంచ్ కంది మల్ల గోపాల్ రెడ్డి పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో “హెల్మెట్ లేకుంటే గ్రామంలో ప్రవేశం లేదు” అనే నినాదంతో యువత ముందుకు వచ్చి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని పేర్కొన్నారు.

గ్రామంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, కుటుంబాల భద్రత కోసం ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మంచి స్పందన చూపుతున్నారు.

Sthanikam

రోడ్డు భద్రతకు గ్రామం ముందడుగు – హెల్మెట్ లేకుంటే ప్రవేశం లేదు.నిర్నెముల

Article Image

నిర్నెముల ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ యువకులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామంలో హెల్మెట్ ధరించని వారికి ప్రవేశం నిరాకరించాలనే సందేశంతో పోస్టర్లు, స్టేటస్‌లను షేర్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.

సర్పంచ్ కంది మల్ల గోపాల్ రెడ్డి పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో “హెల్మెట్ లేకుంటే గ్రామంలో ప్రవేశం లేదు” అనే నినాదంతో యువత ముందుకు వచ్చి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని పేర్కొన్నారు.

గ్రామంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, కుటుంబాల భద్రత కోసం ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మంచి స్పందన చూపుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News