Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:02 AM

రంజోల్, మాచ్నూర్, కాశీపూర్ విద్యాసంస్థల్లో షీ టీమ్ అవగాహన సదస్సు

28-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో రంజోల్ పాలిటెక్నిక్ కాలేజ్, మాచ్నూర్ కేంద్రీయ విద్యాలయం, కాశీపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్ మాట్లాడుతూ జిల్లాలో మహిళల రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్ బృందాలు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. పితృస్వామ్య వ్యవస్థ, లింగ వివక్ష, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, మహిళల హక్కులు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ మోసాలు, ఫేక్ అకౌంట్లు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఆన్‌లైన్ వేధింపులు వంటి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 మరియు సంగారెడ్డి షీ టీమ్ నంబర్ 8712656772ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్, సిబ్బంది, కళాశాలలు మరియు పాఠశాలల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రంజోల్, మాచ్నూర్, కాశీపూర్ విద్యాసంస్థల్లో షీ టీమ్ అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News