PRINT TIME: March 21, 2026 05:18 AM
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
March 21, 2026 02:49 AM
11 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ముస్లిం సోదరీ–సోదరులకు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ గంగా–జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తుందని, రాష్ట్రంలో మత సామరస్య వాతావరణం మరింత బలోపేతం కావాలని ఆశించారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి