Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:03 AM

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
March 21, 2026 02:50 PM 135 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలు మసీదులను సందర్శించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ నెలలో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు.

అలాగే గతంలో రంజాన్‌తో పాటు ఇతర పండుగలు అంగరంగ వైభవంగా నిర్వహించబడేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీ ముబారక్, మసీదుల అభివృద్ధి, రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లు, మైనార్టీ కార్పొరేషన్లు, స్కాలర్‌షిప్‌లు వంటి పథకాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. నకిరేకల్ మండల కేంద్రంలో షాదిఖానా నిర్మాణానికి రూ.1 కోటి నిధులు మంజూరు చేసి, స్థలం కేటాయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని అన్నారు.

నార్కట్‌పల్లి, చిట్యాల మండల కేంద్రాల్లో షాదిఖానాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అలాగే రామన్నపేటలో అలీ సాహెబ్ గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News