Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:02 AM

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి

20-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పాటించాలని కోరారు. త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పర్వదినం సమాజానికి ఐక్యతను అందిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో కుల, మతాల ఐక్యతను పెంపొందించడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాత్ర విశేషమని తెలిపారు. ఆయన పాలనలోనే పండుగల ప్రాధాన్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రధాన పండుగలను ప్రభుత్వ స్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నామని, గాంధీ వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేసిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ని కొనియాడారు. గంగా జామున తహజీబ్ తరహాలో తెలంగాణలో అన్ని మతాలు కలిసిమెలసి జీవిస్తున్నాయని చెప్పారు. గత పన్నెండేళ్లుగా పండుగలన్నీ ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకుంటున్నామని, ఇదే సంప్రదాయాన్ని ముందుతరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది కూడా రంజాన్ పర్వదినాన్ని ఐక్యతతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మరోసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Article Image

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పాటించాలని కోరారు. త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పర్వదినం సమాజానికి ఐక్యతను అందిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో కుల, మతాల ఐక్యతను పెంపొందించడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాత్ర విశేషమని తెలిపారు. ఆయన పాలనలోనే పండుగల ప్రాధాన్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రధాన పండుగలను ప్రభుత్వ స్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నామని, గాంధీ వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేసిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ని కొనియాడారు. గంగా జామున తహజీబ్ తరహాలో తెలంగాణలో అన్ని మతాలు కలిసిమెలసి జీవిస్తున్నాయని చెప్పారు. గత పన్నెండేళ్లుగా పండుగలన్నీ ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకుంటున్నామని, ఇదే సంప్రదాయాన్ని ముందుతరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది కూడా రంజాన్ పర్వదినాన్ని ఐక్యతతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మరోసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News