Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:34 AM

రెండో రోజుకు చేరిన సీపీఎం నిరవధిక నిరాహార దీక్షలు

17-03-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రూ.40 కోట్లు కేటాయించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా రామన్నపేట ప్రభుత్వాసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలకు సరైన వైద్యం అందడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నదని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంగా ఎనిమిది మండలాల ప్రజలకు గత 56 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈ ఆసుపత్రి ప్రస్తుతం పాత భవనంలో ప్రమాదకర పరిస్థితుల్లో కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏరియా ఆసుపత్రిగా బోర్డు ఏర్పాటు చేసి పది సంవత్సరాలు గడిచినా అమలు జరగలేదని, 50 పడకల ఆసుపత్రి కోసం అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శిలాఫలకం వేసి మూడు సంవత్సరాలు గడిచినా నిధులు విడుదల కాలేదని విమర్శించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి ప్రధమ చికిత్స, పోస్టుమార్టంలకే పరిమితమైందని, పేదలకు సరైన వైద్యం అందడం లేదన్నారు.

ప్రతిరోజూ సుమారు 400 మంది అవుట్ పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నప్పటికీ, రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రతిసారి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఫలితంగా ప్రసవాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రూ.40 కోట్లు కేటాయించి 100 పడకల నూతన భవనం నిర్మించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు నిరవధిక నిరాహార దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు.

నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులు:

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూర నరసింహచారి, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, నాగటి ఉపేందర్, వేముల సైదులు, చానకొండ రాము తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

Sthanikam

రెండో రోజుకు చేరిన సీపీఎం నిరవధిక నిరాహార దీక్షలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News