Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:57 PM

రెండవ గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా నల్లపోచమ్మ ఉత్సవాలు

30-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు రెండవ గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో మహాభిషేకం చేసి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు–కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి వివిధ రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. హారతి సమర్పించి నైవేద్యం నివేదించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఏడు వారాల జాతరలో రెండవ గురువారం ప్రత్యేక ప్రాధాన్యం కలిగినదని, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటని, ఇక్కడ మొక్కులు పెట్టిన భక్తుల కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

Sthanikam

రెండవ గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా నల్లపోచమ్మ ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News