Sthanikam - Truth Matters
Logo

రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి

Updated : 27 Mar 2026 19:20 IST
As Preferred Source 1 min read
రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి

వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం గోపురం

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ పట్టణంలోని రెండవ భద్రాద్రిగా వెలుగొందుతున్న రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు రామగిరి దేవాలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. రెండవ భద్రాద్రిగా పేరు నిలబెట్టేలా ఆలయాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. భక్తులకు వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

దర్శన మార్గాల విస్తరణ కోసం అవసరమైన భూముల సేకరణపై చర్చలు కొనసాగుతున్నాయని, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను కాపాడుతూ మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఆలయ భూములకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారిని బైపాస్ మార్గంలో మళ్లించినట్లు తెలిపారు.

కళ్యాణోత్సవానికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు తమ నివాసం నుంచి బాజా భజంత్రీల మధ్య ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం నవమి వేడుకల సందర్భంగా మంత్రి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించగా సుమారు 4 వేల మందికి భోజన వసతి కల్పించారు.

మేయర్ మాట్లాడుతూ మంత్రి సహకారంతో రామగిరి రామాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈవో జయరామయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి