Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:07 PM

రాయిపల్లి డ్యాం ప్రాంతాన్ని సందర్శించిన:ఖేఢ్ ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి

29-05-2026 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం రాయిపల్లి గ్రామ శివారులో సింగూర్ ప్రాజెక్టు మరమ్మత్తు పనుల నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేయడంతో నిజాం కాలంలో నిర్మించిన పురాతన డ్యాం వెలుగులోకి రావడం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అక్కడికి చేరుకుని పురాతన ఆనకట్టను పరిశీలించారు. డ్యాం నిర్మాణ శైలి, దాని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన ఆయన రైతులు, గ్రామ ప్రజలతో మాట్లాడి గతంలో ఈ డ్యాం ద్వారా సాగునీటి వినియోగం ఎలా ఉండేదనే వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఈ ప్రాంతంలో కొత్త డ్యాం లేదా అత్యాధునిక రబ్బర్ డ్యాం నిర్మాణానికి ఉన్న అవకాశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పురాతన డ్యాం ఆధారంగా కొత్త నిర్మాణం చేపడితే వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని తెలిపారు. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, నీటిపారుదల శాఖ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

రాయిపల్లి డ్యాం ప్రాంతాన్ని సందర్శించిన:ఖేఢ్ ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News