Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:45 PM

రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానని 'గద్దెఎక్కిన' చంద్రబాబు 'రెడ్ బుక్' తో 'అరాచక' పాలనను సాగిస్తున్నారు.* *

రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానని 'గద్దెఎక్కిన' చంద్రబాబు 'రెడ్ బుక్' తో 'అరాచక' పాలనను సాగిస్తున్నారు.* *

రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానని 'గద్దెఎక్కిన' చంద్రబాబు 'రెడ్ బుక్' తో 'అరాచక' పాలనను సాగిస్తున్నారు.*  *
February 01, 2026 08:33 PM 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

**రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానని 'గద్దెఎక్కిన' చంద్రబాబు 'రెడ్ బుక్' తో 'అరాచక' పాలనను సాగిస్తున్నారు.*

*

రాష్ట్రంలో అధికారపార్టీకి చెందిన టిడిపి గూండాలచే ... మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ సీపీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అంబటి రాంబాబు గారిపై దాడి చేయించడమే కాదు, ఆయన పార్టీ కార్యాలయం, మరియు ఇంటిని ముట్టడించి, ఫర్నీచర్, విలువైన వస్తువులకు నిప్పంటించి తగలుపెట్టడం, నిర్మాణాలను ద్వంశం చేసి, కుటుంబీకులను భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత దుర్మార్గం. ఇది టీడీపీ గూండాలు ఉద్ధేశం పూర్వకంగా ఆయనపైన చేసిన దాడి మరియు ఆయన కార్యాలయంలోని, ఇంటి లోని విలువైన వస్తువులను తగలు పెట్టడం, ఇంటి నిర్మాణాలను పగలు కొట్టడం అంటే ఇది ముమ్మాటికి ఒక ప్రణాళికతో టీడీపీ గూండాలతో ఆయన పై బాబు, లోకేష్ చేయించిన హత్యాయత్నంగానే భావించాలి. అంతేకాదు, సుపరిపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను, సుపరిపాలను పక్కన పెట్టి.. మా పార్టీ అధ్యక్షులు మరియు మాజీ సీఎం గౌ. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారిని, మా పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే మా నాయకులపై టీడీపీ గూండాలచే దౌర్జన్యాలు చేయించడం, జైళ్లకు పంపడం వంటి చర్యలతో.. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన కాదు, అటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. చట్టం ప్రకారం రక్షణ కల్పించాల్సిన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం అత్యంత దురదృష్టకరం.

మా జగనన్న పాలనలో.. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యితో తయరుచేసారని అబధ్దపు ప్రచారంతో ప్రజలను మోసం చేసిన చంద్ర బాబు.. మొదటి నుంచి ఆయన నోటి మాటలు, ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కల్తీయే.. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తానని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ ని తెచ్చారు. రాజధాని అమరావతి ని ప్రపంచ రాజధానిలను మెప్పించేలా నిర్మిస్తానని చెప్పి వరదనీరు బురదనీటిలో నిర్మాణాలు నత్త నడక లో నడుస్తున్నాయి. రాష్ట్రంలోకి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు ఊకదంపుడుగా వచ్చి పెట్టేటందుకు క్యూ లైన్ లో అనుమతులు పొందుతున్నారని మీ సొంత అద్దె మీడియాలతో చేసే ప్రచారం తప్ప.. రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన పరిశ్రమలు ఎన్ని.. ఎంత మంది కి ఉపాధి కల్పించారనేది ప్రజలు గమనిస్తున్నారు. మీ రెడ్ బుక్ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. అతి గర్వంతో ఒళ్ళు మరిచి మీ టిడిపి ప్రభుత్వం, మీ పార్టీ గూండాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకత ఉప్పెనగా మారి తెలుగు దేశం పార్టీని సర్వ నాశనం చేస్తుంది. రాష్ట్రంలో 40 శాతం పైన ఫిక్స్డ్ ఓటు బ్యాంకు మా వెంటే ఉంది. ఎన్నికల ముందు ఏ రెండు వర్గాల జనాన్ని కొంత మభ్యపెట్టి చీల్చి గెలిచావో.. ఆ జనంకు మీరేమి చేశారో అనేది పూర్తిగా తెలుసుకున్నారు. మనసు మారింది. వారంతా ఎన్నికల ముందు మా వెంటే. ఎలాగూ మీరు రెండోసారి అధికారంలోకి రావడం అనేది ఎలాగూ లేదు. మిమ్మల్ని నమ్ముకుని అధికారంలోకి వచ్చిన జనసేనకు కూడా మీ బురద అంటించారు. జనసేన కూడా ప్రజల్లో పలుచబడింది. మా జగన్ అన్న అంటే ఏమిటో ప్రజలు అర్దం చేసుకున్నారు. కావున మీ రెడ్ బుక్ ప్రక్కన పెట్టి బుద్దిగా ఈ రెండు మూడు ఏళ్లలో అయినా ప్రజలకు మంచి పాలన ఇవ్వండి. అప్రజాస్వామ్యం గా అరెస్టు చేసిన మా నాయకుడు అంబటి రాంబాబు గారిని తక్షణమే విడుదల చేయండి.

ఇట్లు

మీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)పలాస, ఇచ్చాపురం దుంపల రామారావు (లక్ష్మణ రావు).

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News