ఏడు కార్పొరేషన్లు, నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏడు కార్పొరేషన్లు, నూట పదహారు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది.రేపటి నుంచి ఈ నెల ముప్పైవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి మూడో తేదీ వరకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి పదకొండో తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, ఫిబ్రవరి పదమూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.ఈ ఎన్నికల్లో మొత్తం యాభై రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను పూర్తిగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి