Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
07-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు పాఠశాలలలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం కిరణ్ కుమార్ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా తలకు దెబ్బ తాకడం ద్వారానే మరణిస్తున్నారని, హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందన్నారు. కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకుంటే ఎయిర్ బ్యాగుల వల్ల ఉపయోగం అన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని సూచించారు. విద్యార్థులంతా తమ కుటుంబ పెద్దలకు రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం విద్యార్థులు ఎంతో గట్టిగా చప్పట్లు కొట్టడంతో వెహికల్ ఇన్స్పెక్టర్ స్పందిస్తూ ఎన్నిసార్లు చప్పట్లు కొట్టారో అంతా మందికి రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News