Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:14 PM

రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్

26-02-2026 236 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోని పలు కాలనీలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉప్ప సర్పంచ్ మోటె రమేష్ సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.

పట్టణంలోని బీసీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్థంభాలకు తక్కువ వోల్టేజ్, 11 కేవీ, 33 కేవీ లైన్లు అన్నీ ఒకే పెద్ద స్థంభాలపై సమగ్రంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా చేస్తే భద్రతతో పాటు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు.

అలాగే ఎస్సీ కాలనీలో గొర్ల మల్లయ్య ఇంటి మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించి ప్రత్యామ్నాయ మార్గంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి మీదుగా లైన్ ఉండటం ప్రమాదకరమని, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని భువనగిరి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించి రహదారి విస్తరణకు అనుకూలంగా మార్చాలని కోరారు. విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకంటి సుదర్శన్, బండ లింగస్వామి, మోట్ మహేష్, జడ సంతోష్, సుర్వి హరిబాబు, ఊట్కూరి శ్రీను, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News