Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

రామన్నపేటలో ఆర్డీఓ హామీతో సిపిఎం దీక్షల విరమణ

19-03-2026 120 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలుగా అభివృద్ధి చేయాలని సిపిఎం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు తాత్కాలికంగా విరమించబడ్డాయి.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ దీక్షలకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో ఆర్డీఓ శేఖర్ రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆసుపత్రి అభివృద్ధి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో దీక్షలను విరమించినట్లు తెలిపారు.

అయితే హామీలు అమలు చేయకపోతే దశలవారీగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు.

వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహాచారి, కందుల హనుమంతు,మండల కమిటి సభ్యులు గోరిగే సోములు, నాకటి ఉపేందర్, వేముల సైదులు, శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రామన్నపేటలో ఆర్డీఓ హామీతో సిపిఎం దీక్షల విరమణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News