Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:04 AM

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా పెంచాలి

16-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిపిఎం నిరాహార దీక్షకు కల్లుగీత కార్మిక సంఘం సంఘీభావం

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచి రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సంఘీభావం తెలిపింది.

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజుల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు భావనల పెండ్లి బాలరాజు దీక్షలో పాల్గొని మండల కమిటీ సభ్యులను పూలమాలలు వేసి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు సుమారు 400 మంది ఓపీ ద్వారా వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి 30 పడకలతో మాత్రమే కొనసాగుతుండటంతో సరైన వైద్య సేవలు అందడం లేదని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలకే రోగులను నల్లగొండ, హైదరాబాద్‌కు రిఫర్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచి అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ అధ్యక్షుడు కునూరు మల్లేశం, కోశాధికారి మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, తోర్పునూరి శ్రీనివాస్, గుండాల ప్రసాద్, కునూరు గణేష్, అంతటి సత్తయ్య, బావండ్లపల్లి సత్యం, అంతటి నరసింహ, తాళ్లపల్లి జితేందర్, గుడిసె మల్లేశం, గంగాదేవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా పెంచాలి

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News