Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

రామన్నపేట డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ

17-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన

రామన్నపేట:

క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమంలో భాగంగా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్ క్రాఫ్ట్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం మాట్లాడుతూ యువతీ యువకులు స్వశక్తితో ఎదగడానికి జ్యూట్ బ్యాగుల తయారీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమానికి హాజరైన జ్యూట్ బ్యాగుల తయారీ నిపుణురాలు శైలజ మాట్లాడుతూ జ్యూట్ బ్యాగుల అల్లిక విధానం, వాటి మార్కెటింగ్ అవకాశాలపై విద్యార్థులకు ప్రాయోగికంగా శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రాకపోయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, స్వయంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకునే దిశగా ముందుకు రావాలని సూచించారు. జ్యూట్ బ్యాగుల తయారీ ద్వారా ఉపాధి పొందడమే కాకుండా ఆర్థికంగా ఎదగవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ జే. చిన్నబాబు, డాక్టర్ సునీత, ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ల శ్రీనివాస్, ఏఓ జి. కరుణాకర్, అమర్, జె. నరేష్, ఏ. ఆంజనేయులు, రాధిక, రవి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News