Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:47 AM

రాజేష్ మృతిపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: రామచందర్ రావు

09-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

రాజేష్ మృతి ముమ్మాటికీ పోలీసుల వేధింపులే: ఎన్. రామచందర్ రావు

దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని, ఇది పోలీసుల అతి ప్రవర్తన వల్లే జరిగిందని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం కోదాడలో రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజేష్‌ను అక్రమంగా నిర్బంధించి, కోర్టులో హాజరుపరచకుండా నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునే ప్రభుత్వం, దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసి, సమగ్ర విచారణ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక యువకుడి మృతి మాత్రమే కాదని, దళిత సమాజంపై జరుగుతున్న దాడిగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వారి వెంట మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, జుట్టు కొండా సత్యనారాయణ,కొప్పుల నరసింహారెడ్డి, మురళీధర్ రెడ్డి, వంగవీటి శ్రీనివాస్,బండారు కవిత రెడ్డి, అంజి యాదవ్, బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల వెంకటరామయ్య,నూనె సులోచన, యదా రమేష్, యశ్వంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రాజేష్ మృతిపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: రామచందర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News