Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 03:56 AM

రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పౌరులు కృషి చేయాలి

రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పౌరులు కృషి చేయాలి

రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పౌరులు కృషి చేయాలి
January 26, 2026 06:21 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపు

సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు దేశ పౌరులంతా కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన ధర్మబిక్షం భవన్‌లోని సిపిఐ కార్యాలయం ఎదుట వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ జెండాను బెజవాడ వెంకటేశ్వర్లు, పార్టీ జెండాను సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కే వి యల్ ఎగరవేశారు. అనంతరం అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 26 జనవరి 1950న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం దేశానికి స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదం వంటి విలువలను అందించిందన్నారు. అయితే నేటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగ హక్కులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతులు, దళితులు, ఆదివాసీలు, మహిళా వర్గాల హక్కులను కాలరాస్తూ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలు అమలవుతున్నాయని విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పాలకులు ప్రజారంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పోరేట్ వర్గాలకు అప్పగిస్తూ పేద ప్రజల జీవితాలను మరింత దుర్భరంగా మారుస్తున్నారని అన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం దేశాన్ని కుదిపేస్తున్నాయని పేర్కొన్నారు.

సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కే వి యల్ మాట్లాడుతూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలను రక్షించేందుకు ప్రజాస్వామ్య హక్కుల కోసం శ్రమజీవుల ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలే నిజమైన పాలకులు అన్న సత్యాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు సమిష్టి పోరాటాలు అనివార్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాల ధనుంజయ నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అనంతల మల్లేశ్వరి, పట్టణ కార్యవర్గ సభ్యులు బొమ్మగాని శ్రీనివాస్, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, ఎండి పాషా, నిమ్మల ప్రభాకర్, నీల శ్రీనివాస్, చిలక రాజు శ్రీను, బూర సైదులు, ఎడెల్లి శ్రీకాంత్, దీకొండ శ్రీనివాస్, దంతాల పద్మరేఖ, దేశగాని హేమలత, మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే హెచ్పిసిఎల్ నాయకులు బాబా, టి సైదులు, టిప్పర్ యూనియన్ నాయకులు నరేష్, సివిల్ సప్లై యూనియన్, రిక్షా యూనియన్, దిగుమతి హమాలి సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News