Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:51 PM

రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలి; ఎమ్మెల్యే సామెల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి

రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలి; ఎమ్మెల్యే సామెల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి

రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలి; ఎమ్మెల్యే సామెల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి
April 09, 2026 07:34 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రైతులు ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు.గురువారం తుంగతుర్తి నియోజకవర్గ నూతనకల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ... రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ధాన్యం కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రైతులు తీసుకొచ్చే ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని వివరించారు.రైతులు కష్టపడి తాము పండించినటువంటి పంటను దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలన్నారు.ఏ గ్రేడ్ ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు పొందాలన్నారు.రబి ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రారంభ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లను సరిగ్గా చేయకపోవడంతో ఏపీఎం వెంకట్రెడ్డి పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రావు,ఎంపీడీవో సునీత,జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్,మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి, ఏపిఎం వెంకట్రెడ్డి,ఏవో జానయ్య, సీసీలు సరస్వతి,సునీత, మండల సమైక్య అధ్యక్షరాలు, ఆయా గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు,కృష్ణా నాయక్, మల్లికార్జున్,శంకర్ నాయక్, నాగం సరిత సుధీర్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డుపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News