Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:16 PM

రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొనుగోలు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ తడిసిన ధాన్యాన్నీ సేకరిస్తాం : మంత్రి ఉత్తమ్

28-05-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి

రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్నీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతుల పక్షాన ప్రభుత్వం నిలుస్తుందని, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు వచ్చినా ధాన్యం సేకరణ ఆపబోమన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. వరి ధాన్యం రికార్డు స్థాయిలో దిగుబడి రావడంతో సేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు.

రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గోదాములకు ధాన్యం తరలింపులో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఇసుక వాహనాలను ధాన్యం రవాణా, అన్‌లోడింగ్ కోసం వినియోగించుకోవచ్చన్నారు.

రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్‌లో వరి పంట అద్భుతంగా వచ్చిందన్నారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో భారీ మొత్తంలో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని స్పష్టం చేశారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతుల పక్షాన ప్రభుత్వం ఉందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2,75,686.220 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.

ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొనుగోలు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ తడిసిన ధాన్యాన్నీ సేకరిస్తాం : మంత్రి ఉత్తమ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News