Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:59 PM

రైతులను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు తప్పవు: మాజీ మంత్రి కేటీఆర్

04-05-2026 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శనగ పంటను కొనుగోలు కేంద్రానికి తెచ్చి నెలరోజులు గడిచినా ఇప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా, ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. అన్ని పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి మోసం చేశారని, రైతు భరోసా సక్రమంగా అందడం లేదన్నారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వడదెబ్బలు, పిడుగులు, గుండెపోటులతో రైతులు మృతిచెందుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలుస్తామని, అవసరమైతే అధికార కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

రైతులను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు తప్పవు: మాజీ మంత్రి కేటీఆర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News