Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:27 AM

రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు - సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

06-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై ఆర్థిక భారం మోపుతూ వ్యవసాయానికి దూరం చేసే విధానాలను అమలు చేస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఎం.డేవిడ్ కుమార్ విమర్శించారు. నకిరేకల్‌లోని యానాల మల్లారెడ్డి స్మారక భవన్‌లో నిర్వహించిన జిల్లా ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎరువుల ధరల పెంపు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి భవిష్యత్తులో రైతులపై విద్యుత్ బిల్లుల భారం మోపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతుల ఉచిత విద్యుత్‌కు ముప్పు పొంచి ఉందని, రైతులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సమావేశానికి జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షత వహించగా, ఏఐకేఎంఎస్, పీఓడబ్ల్యూతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు - సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

Article Image

నకిరేకల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై ఆర్థిక భారం మోపుతూ వ్యవసాయానికి దూరం చేసే విధానాలను అమలు చేస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఎం.డేవిడ్ కుమార్ విమర్శించారు. నకిరేకల్‌లోని యానాల మల్లారెడ్డి స్మారక భవన్‌లో నిర్వహించిన జిల్లా ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎరువుల ధరల పెంపు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి భవిష్యత్తులో రైతులపై విద్యుత్ బిల్లుల భారం మోపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతుల ఉచిత విద్యుత్‌కు ముప్పు పొంచి ఉందని, రైతులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సమావేశానికి జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షత వహించగా, ఏఐకేఎంఎస్, పీఓడబ్ల్యూతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News