Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:21 PM

మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ

06-06-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వట్టిపల్లి మండలం పరిధిలో మేడికుంద గ్రామంలో శనివారం సర్పంచ్ శ్రీమతి చంద్రకళ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హన్మంత్ రెడ్డి గ్రామ అభివృద్ధి నివేదికను చదివి వినిపించగా, గ్రామ కార్యదర్శి చరణ్ రాజ్ ఎజెండా అంశాలపై చర్చ నిర్వహించారు. గ్రామ నర్సరీ నిర్వహణ, మురికికాలువల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, బడిబాట కార్యక్రమం, ప్రీ-ప్రైమరీ విద్య, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, వృద్ధాప్య పింఛన్ల ఫోటో క్యాప్చర్ తదితర అంశాలపై గ్రామస్థులతో విస్తృతంగా చర్చించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు స్వీకరించారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని సభలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎం.పీ.టి.సి శంకరప్ప, హెచ్‌ఎం సాయికృష్ణ, ఎఫ్‌ఏ సంగమేశ్వర్, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు.

Sthanikam

మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News