Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

ఘాట్‌ రోడ్డు కాదు.. గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారా? - మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

06-06-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్‌సాబ్ గుట్టలపై నిర్వహించిన బ్లాస్టింగ్‌ల వల్ల మునుగోడు రోడ్ హౌసింగ్ కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, బ్లాస్టింగ్ సమయంలో పెద్ద రాళ్లు ఇళ్లపై పడి స్లాబ్‌లు, రేకులు దెబ్బతిన్నాయని స్థానికులు తమకు వివరించారని తెలిపారు.

ఘాట్‌ రోడ్డు నిర్మాణం పేరుతో 20 మీటర్ల లోతు వరకు తవ్వకాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్‌లు నిర్వహించడం దారుణమని, ఏదైనా ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని అధికారులను ప్రశ్నించారు.

ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్, అంచనాలు, టెండర్ ప్రక్రియ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించి, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ఘాట్‌ రోడ్డు కాదు.. గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారా? - మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

Article Image

నల్లగొండ: బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్‌సాబ్ గుట్టలపై నిర్వహించిన బ్లాస్టింగ్‌ల వల్ల మునుగోడు రోడ్ హౌసింగ్ కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, బ్లాస్టింగ్ సమయంలో పెద్ద రాళ్లు ఇళ్లపై పడి స్లాబ్‌లు, రేకులు దెబ్బతిన్నాయని స్థానికులు తమకు వివరించారని తెలిపారు.

ఘాట్‌ రోడ్డు నిర్మాణం పేరుతో 20 మీటర్ల లోతు వరకు తవ్వకాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్‌లు నిర్వహించడం దారుణమని, ఏదైనా ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని అధికారులను ప్రశ్నించారు.

ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్, అంచనాలు, టెండర్ ప్రక్రియ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించి, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News