Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:27 AM

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం.

06-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు శనివారం రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాలులో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి–కమ్–చైర్మన్, మండల న్యాయ సేవల కమిటీ అధ్యక్షురాలు జి. సబిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

రాజీ ద్వారా పరిష్కరించదగిన కేసులను గుర్తించడం, సంబంధిత పక్షాలకు అవగాహన కల్పించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం తదితర అంశాలపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తమ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందవచ్చని జి. సబిత పేర్కొన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పూర్తి సహకారం అందించాలని ఆమె సూచించారు.

సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, రామన్నపేట ఎస్‌ఐ నాగరాజు, అడ్డగూడూరు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు

Sthanikam

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News