Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 01:22 PM

99 రోజుల ప్రజాపాలన విజయవంతానికి ప్రజలు సహకరించాలి. సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి

06-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మాపురం సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి పిలుపునిచ్చారు, లక్ష్మాపురం గ్రామాoలో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ సదస్సులు దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి సంరక్షణ వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఎంపీడీవో ఎ. రాములు గ్రామాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, తాగునీటి సదుపాయాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సీజన్‌కు అనుగుణంగా పంటల సాగుపై సూచనలు అందించారు, ఆర్‌ఐ శోభ జనాభా గణన ప్రాధాన్యాన్ని వివరించగా, పోలీసు శాఖ అధికారులు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. హౌసింగ్ శాఖ అధికారులు గృహ నిర్మాణాల పురోగతిని వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎం.డి. రావూఫ్ అలీ, మండల వ్యవసాయ అధికారి ఎం.డి. అజాజ్ అలీ ఖాన్, విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాఘవ, హౌసింగ్ ఏఈ సురేష్, ఈజీఎస్ ఏపీఓ పి. వెంకన్న, పంచాయతీ కార్యదర్శి ఎన్. విఠల్‌కుమార్, జీపీఓ అనిత, ఈజీఎస్ ఎఫ్‌ఏ చంద్రయ్య, అంగన్‌వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

99 రోజుల ప్రజాపాలన విజయవంతానికి ప్రజలు సహకరించాలి. సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News