Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 PM

నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తతకు దారి తీసిన అర్ధరాత్రి ఘటన

06-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య.. స్వల్పంగా దెబ్బతిన్న తల భాగం.. పెయింటింగ్‌తో ఆనవాళ్లు తొలగించిన మున్సిపల్ సిబ్బంది.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో విగ్రహం తల భాగం స్వల్పంగా కాలిపోయినట్లు గుర్తించారు. ఉదయం స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఘటన సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని దగ్ధమైన భాగానికి పెయింటింగ్ వేయించి విగ్రహాన్ని యథాతథ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విగ్రహానికి నిప్పు పెట్టిన వారెవరు, వారి ఉద్దేశ్యం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.జిల్లా కేంద్రంలో ప్రముఖ వ్యక్తి విగ్రహంపై జరిగిన ఈ దుశ్చర్య స్థానికంగా ఆందోళనకు కారణమైంది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు త్వరలోనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Sthanikam

నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తతకు దారి తీసిన అర్ధరాత్రి ఘటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News