Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 03:33 PM

ఘాట్ రోడ్డు కోసమా.. గుప్త నిధుల కోసమా?

ఘాట్ రోడ్డు కోసమా.. గుప్త నిధుల కోసమా?

ఘాట్ రోడ్డు కోసమా.. గుప్త నిధుల కోసమా?
June 06, 2026 02:07 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ముందస్తు సమాచారం లేకుండా బ్రహ్మంగారి గుట్టపై పేలుళ్లు..

ఇళ్లపై పడిన బండరాళ్లు తృటిలో తప్పిన ప్రాణాపాయం..

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి..

నిబంధనల ఉల్లంఘన అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం..

నల్లగొండ : నల్లగొండ పట్టణ పరిధిలోని బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలపై ఘాట్ రోడ్డు నిర్మాణం పేరిట జరుగుతున్న తవ్వకాలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అసలు అక్కడ ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారా.. లేక గుప్త నిధుల కోసం తవ్వుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన పేలుళ్ల కారణంగా నష్టపోయిన స్థానిక ప్రజలను శనివారం ఆయన వారి నివాసాల వద్దకు వెళ్లి పరామర్శించారు. గుట్టల పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న బాధితులు తమకు జరిగిన నష్టాన్ని, ఎదుర్కొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరించి ఆవేదన వ్యక్తం చేశారు.

ముందస్తు సమాచారం లేదు సైరన్ వేయలేదు..

శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం సైరన్ కూడా మోగించకుండా కాంట్రాక్టర్లు ఓపెన్ బ్లాస్టింగ్ (భారీ పేలుళ్లు) జరిపారని స్థానికులు కంచర్ల దృష్టికి తెచ్చారు. ఈ పేలుళ్ల ధాటికి పెద్ద ఎత్తున బండరాళ్లు వచ్చి తమ ఇళ్లపై పడ్డాయని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. రాళ్లు పడటంతో ఇళ్ల స్లాబ్‌లకు రంధ్రాలు పడ్డాయని, రేకులు పగిలిపోయాయని చూపించారు. ఇంట్లో పనులు చేసుకుంటున్న మహిళల పక్కనే భారీ రాళ్లు పడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పిందని, ప్రాణభయంతో రాత్రికి రాత్రే ఇళ్లను వదిలి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నామని వారు వాపోయారు.

20 మీటర్ల లోతు తవ్వకాలు ఎందుకు..

బాధితుల ఆవేదనను విన్న అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాస గృహాలు ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్‌కు అధికారులు ఎలా అనుమతులిస్తారని నిలదీశారు. అదృష్టం బాగుండి ప్రాణాలు దక్కాయని ఏదైనా ప్రాణనష్టం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారని ప్రశ్నించారు. ఘాట్ రోడ్డు కోసం ఏకంగా 20 మీటర్ల (దాదాపు 65 అడుగులు) లోతు గుంతలు తీయడం వెనుక మర్మమేంటని దుయ్యబట్టారు. స్థానికులు అనుమానిస్తున్నట్లుగా ఇక్కడ గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరుపుతున్నట్లు అనుమానంగా ఉందన్నారు.

నిధుల మళ్లింపు విచారణకు డిమాండ్..

ఈ పనులకు సంబంధించి అసలు డీపీఆర్ (DPR), ఎస్టిమేషన్లు ఉన్నాయా? టెండర్ ప్రక్రియ నిర్వహించారా లేక నామినేషన్ పద్ధతిపై ఎవరికైనా కట్టబెట్టారా? దీనికి అసలు ప్రభుత్వ మంజూరీ ఉందా? అని కంచర్ల అధికారులను నిలదీశారు. నిబంధనలను తుంగలో తొక్కి, కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికే అధికారులు పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. గతంలో తాము నగరంలో పలు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయించిన నిధులను, ఇప్పుడు సీసీ రోడ్లు, డ్రైనేజీల పేరిట ప్రజలకు ఉపయోగం లేని చోటకు మళ్లించారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల వెంచర్లు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి నాణ్యత లేకుండా పనులు చేపడుతున్నారని, వీటన్నింటిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరపాలని కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెఱిక యాదయ్య, బాణావత్ దీప్ల, కుందూరి ప్రవీణ్ రెడ్డి, గోపగోని స్వాతి రాజశేఖర్, జీ యడవల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తన్న, స్థానిక నాయకులు కరుణ్, జయరాజ్, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News