Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 01:27 PM

25 గ్రామాలకు వరంగా మొబైల్ వైద్య సేవలు

25 గ్రామాలకు వరంగా మొబైల్ వైద్య సేవలు

25 గ్రామాలకు వరంగా మొబైల్ వైద్య సేవలు
06-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ పరిసర ప్రాంత ప్రజలకు వోక్‌హార్డ్ ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత మొబైల్ వైద్య సేవలు వరంగా మారాయి. హెచ్‌ఎఫ్‌సీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో గత 7–8 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సేవల ద్వారా సుమారు 25 గ్రామాలు, తాండాలకు చెందిన వేలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.

మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) ద్వారా గ్రామాలకు నేరుగా చేరుకొని సాధారణ వైద్య పరీక్షలతో పాటు 40 నుంచి 50 రకాల ల్యాబ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో నిపుణులైన వైద్యులకు, ప్రముఖ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లడం ద్వారా ఈ కార్యక్రమం విశేష ఆదరణ పొందుతోంది. ప్రజారోగ్య పరిరక్షణలో వోక్‌హార్డ్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గ్రామ ప్రజలు, సర్పంచులు, గ్రామ పెద్దలు ప్రశంసిస్తూ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణలో తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జ్ వినోద్ సారి కీలక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఆయన సేవా దృక్పథం మరెంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Sthanikam

25 గ్రామాలకు వరంగా మొబైల్ వైద్య సేవలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News