Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:23 PM

ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం.. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యం” – కౌన్సిలర్ షారుక్ ఖాన్

06-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో శనివారం కౌన్సిలర్ షారుక్ ఖాన్ ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడమే వార్డు సభ ముఖ్య ఉద్దేశమని కౌన్సిలర్ షారుక్ ఖాన్ తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి సంబంధిత అధికారుల సహకారంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సూచించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ వి. ప్రశాంతి, సీఐ శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం కౌన్సిలర్ షారుక్ ఖాన్ ముఖ్య అతిథులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత మరియు మహిళలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, వార్డు సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ స్పష్టం చేశారు.

Sthanikam

ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం.. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యం” – కౌన్సిలర్ షారుక్ ఖాన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News