Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:52 AM

అర్హులకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి ఎంపీడీవోకు దళిత మోర్చా మండల అధ్యక్షుడు వినతి

06-06-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిదానపల్లి, అర్హులైన నిరుపేదలకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని దళిత మోర్చా మండల అధ్యక్షుడు రాపోలు రమేష్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన అవగాహన సదస్సుకు హాజరైన ఎంపీడీవోకు శనివారం ఆయన వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాపోలు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో అర్హత కలిగిన పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు. అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన నిరుపేదలకు మాత్రమే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీడీవో సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఎంపిఓ రావుఫ్ అలీ, తదితరులు ఉన్నారు.

Sthanikam

అర్హులకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి ఎంపీడీవోకు దళిత మోర్చా మండల అధ్యక్షుడు వినతి

Article Image

నిదానపల్లి, అర్హులైన నిరుపేదలకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని దళిత మోర్చా మండల అధ్యక్షుడు రాపోలు రమేష్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన అవగాహన సదస్సుకు హాజరైన ఎంపీడీవోకు శనివారం ఆయన వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాపోలు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో అర్హత కలిగిన పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు. అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన నిరుపేదలకు మాత్రమే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీడీవో సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఎంపిఓ రావుఫ్ అలీ, తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News