Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు సర్పంచ్ విక్రమ్ శ్రీకారం

06-06-2026 189 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 100 రోజుల టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని శనివారం ఇంద్రపాలనగరంలో గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీబీ అనుమానితులకు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు.

గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ కోరారు. టీబీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స అందించి పూర్తిగా నయం చేయవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు సింగణబోయిన జంగయ్య, జిట్టబోయిన వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, బొల్ల నర్సింహా, ఎర్రం దాస్, మంటి బిక్షపతి, శివగల్ల ముత్యాలు, పగుడాల రామచంద్రం పాల్గొన్నారు. అలాగే వైద్యాధికారి జి. గోపాల్, హెచ్‌ఈఓ ఎం. వాణిశ్రీ, సూపర్‌వైజర్ వి. అరుంధతి, ఏఎన్‌ఎం జానకమ్మ, ఎస్‌టీఎస్ అశ్విని, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు హాజరయ్యారు.

Sthanikam

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు సర్పంచ్ విక్రమ్ శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News