ప్రజాపాలనతో గ్రామాభివృద్ధి సాధ్యం. 99 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
ప్రజాపాలనతో గ్రామాభివృద్ధి సాధ్యం. 99 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
Editor Desk
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి సహకరించాలని నిదానపల్లి సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య పిలుపునిచ్చారు. నిదానపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి సంరక్షణ వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో ఎ. రాములు గ్రామాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, తాగునీటి సదుపాయాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సీజన్‌కు అనుగుణంగా పంటల సాగుపై సూచనలు అందించారు. ఆర్‌ఐ శోభ జనాభా గణన ప్రాధాన్యాన్ని వివరించగా, పోలీసు శాఖ అధికారులు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. హౌసింగ్ శాఖ అధికారులు గృహ నిర్మాణాల పురోగతిని వివరించారు.
కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎం.డి. రావూఫ్ అలీ, మండల వ్యవసాయ అధికారి ఎం.డి. అజాజ్ అలీ ఖాన్, విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాఘవ, హౌసింగ్ ఏఈ సురేష్, ఈజీఎస్ ఏపీఓ పి. వెంకన్న, పంచాయతీ కార్యదర్శి సుమన్, ఉప సర్పంచ్ కొండ అండాలు మల్లయ్య,జీపీఓ లక్ష్మి, ఈజీఎస్ ఎఫ్‌ఏ చంద్రయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ భాగ్యమ్మ, అంగన్‌వాడీ టీచర్లు నాగమ్మ, హారిక, వైద్య సిబ్బంది ఆదిలక్ష్మి, గంగపురం మాధవి, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి